సీషెల్స్ గుణపాఠం!

Telugu Lo Computer
0


హిందూ మహాసముద్ర తీర దేశమైన సీషెల్ లో మొత్తం జనాభా 98 వేల మంది. 6.14 శాతం మందికి టీకాను  రెండు డోస్ లు ఇచ్చారు. అయినా ఈ దేశంలో కోవిడ్ కేసులు మరలా వెలుగు చూడడం కలవర పెడుతుంది. మే 1 నుండి ఇక్కడ కేసులు పెరిగిపోయాయి. మే 13న ఒకేరోజు వెయ్యి కేసులు నమోదయ్యాయి. అక్కడ ఉన్న యాక్టీవ్ కేసులలో 33శాతం మంది టీకా వేయించుకున్న వారే కావడం గమనార్హం. కేసులు పెరగడానికి మాస్క్ లు, భౌతికదూరం లాంటి నిబంధనలు పాటించక పోవడమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

పర్యాటక దేశమైన సీషెల్ లో మే 1 నుండి పర్యాటకులకు తలుపులు తెరిచారు. ఆర్ టి పి సి ఆర్ నెగటివ్ రిపోర్ట్ ఉన్న పర్యాటకులకు ఎలాంటి ఎలాంటి క్వారంటైన్ నిబంధనలు లేకుండానే తమ దేశానికి   రావచ్చని స్వగతం పలికారు. ఆంక్షలు ఎత్తివేసి, అన్ని కార్యక్రమాలకు అనుమతించడంతో కేసులు సంఖ్య 9,764, మరణాలు 35కి పెరిగాయి. టీకా తరువాత ప్రజలలో పెరిగిన అలక్ష్యం వలనే వైరస్ ప్రబలడానికి కారణమని అక్కడి ప్రభుతం అభిప్రాయపడుతోంది. టీకా తరువాత వైరస్ బారిన పడ్డప్పటికే లక్షణాలు తీవ్రరూపం దాల్చకపోవడం, ఐసీయూ లో చేరాల్సిన పరిస్థితి రాక పోవడం, ఎవ్వరూ చనిపోకపోవడం సంతోషించవలసిన విషయంగా అధికారులు చేబుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)