ఆయుర్వేద టీకా

Telugu Lo Computer
0

 


కరోనాకు చుక్కల రూపంలో వుండే ఆయుర్వేద టీకా తయారీలో  ముంబైకి చెందిన మెగాల్యాబ్ నిమగ్నమైంది. ఈ టీకా రెండు డోసులుగా  నోటి ద్వారా గాని, ముక్కు ద్వారా గాని ఇస్తారు. ఐఐటి పూర్వ విద్యార్థుల మండలి (అల్యూమిని కౌన్సిల్) ఈ కార్యక్రమానికి మెగాల్యాబ్ కు 300 కోట్లను సమకూర్చింది. ఈ టీకా రాగాల 6 నెలల కాలంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ఐఐటి పూర్వ విద్యార్థుల మండలి అధ్యక్షులు రవిశర్మ తెలియజేశారు. దీనికి అమెరికాకు చెందిన బయో టెక్నాలజీ నిపుణుడు డాక్టర్ అరందమ్ బోస్ నాయకత్వం వహిస్తున్నారు. గతంలో ఫైజర్ టీకా విభాగానికి అధిపతిగా పనిజేశారు.  ఇంజెక్టుబుల్ ఆడజబుల్, నోటి లో, ముక్కులో వేసుకునే చుక్కల టీకాల పదార్ధాల విభాగానికి  ఐఐటి పూర్వ విద్యార్థి అయిన డాక్టర్ శాంతారాం కానే నాయకత్వం వహిస్తారన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)