పెర్ఫ్యూమ్ తో వినూత్న దొంగతనం ?

Telugu Lo Computer
0


మహిళ దుకాణంలో కూర్చుని ఉండగా ఓ యువకుడు ఆమె వద్దకు వెళ్లి  ''రూ.5వేలు ఫోన్ పే  చేస్తా.. క్యాష్ కావాలి'' అడుగుతాడు. అందుకు ఆమె అలాగే ఇస్తా కానీ రూ.50లు అదనంగా చెల్లించాల్సి వస్తుందని అడుగుతుంది. అందుకు ఆ యువకుడు కూడా అంగీకరిస్తాడు. దీంతో ఆమె తన ర్యాక్‌లో ఉన్న ఐదు వేల నోట్లను బయటికి తీసి, కౌంట్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో సదరు వ్యక్తి ఆమెతో తనకు పెర్ఫ్యూమ్  కావాలని అడుగుతాడు. అందుకు ఆమె సరే అని చెబుతుంది. అయితే ఇక్కడే సదరు యువకుడు తన తెలివిని ప్రదర్శించాడు. తనకు ఎలాంటి పెర్ఫ్యూమ్ కావాలో ఆమెకు వివరిస్తూ తన వెంట తెచ్చుకున్న పెర్ఫ్యూమ్ బాటిల్‌తో ఆమె చేతిపై కొంత స్ప్రే చేస్తాడు. ఆ పరిమళాన్ని వాసన చూసిన మహిళ.. ''ఇలాంటి పెర్ఫ్యూమ్ కూడా ఉంది''.. అని చెబుతుంది. అయితే ఆ వెంటనే ఆమె స్పృహ తప్పి పడిపోతుంది. కుర్చీలో కూర్చున్న ఆమె అలాగే నిద్రలోకి జారుకుంటుంది. తర్వాత సదరు యువకుడు తాపీగా ఆమె చేతిలోని డబ్బు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ''ఇది అవగాహన కోసం చేసినట్లుగా ఉన్నాఇలాంటి చోరీలు కూడా జరుగుతున్నాయి''.. అంటూ కొందరు, ''వామ్మో..! ఇలాక్కూడా జరుగుతుందా''.. అంటూ మరికొందరు, షాకింగ్ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)