కర్పూరం - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


ర్పూరం ఎన్నో ఔషధ గుణాలకు పెట్టింది పేరు. కర్పూరం లేని పూజ గది వుండదు. ప్రతీరోజూ కర్పూరం వాసనను కాసేపు పీల్చుకుంటే ఒత్తిడి, ఆందోళన వంటివి దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే జలుబు, దగ్గుతో దీర్ఘకాలంగా ఇబ్బంది పడుతుంటే కూడా కర్పూరం వాసన పీల్చుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. మైగ్రేన్‌ తలనొప్పితో ఇబ్బంది పడే వారికి కూడా కర్పూరం ఎంతో ఉపయోగపడుతుంది. కర్పూరం వాసన పీల్చుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పచ్చ కర్పూరాన్ని నీటిలో కొంచెం కలుపుకొని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అందుకే దేవాలయాల్లో తీర్థంలో కర్పూరాన్ని కలుపుతుంటారు. కర్పూరంలో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి ప్రమాదకరమైన సూక్ష్మక్రిములను నాశనం చేస్తాయి. \జలుబుతో ఇబ్బంది పడుతుంటే కర్పూరాన్ని ఒక క్లాత్‌లో పెట్టుకొని వాసన చూడాలి ఇలా చేయడం వల్ల బ్లాక్‌ అయిన ముక్కు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కర్పూరం వాసనను చూస్తుంటే శరీరంలో శక్తి కూడా పెరుగుతుంది. నిద్రలేమి సమస్య నుంచి కూడా బయటపడొచ్చు. 

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)