విటమిన్ డి లోపం - శరీరంలో కనిపించే మార్పులు !

Telugu Lo Computer
0


విటమిన్ డి శరీరానికి చాలా అవసరం. విటమిన్ డి లోపిస్తే విపరీతమైన అలసటగా ఉంటుంది. ఊరికే నిద్ర వచ్చినట్టుగా, బాగా చిరాకుగా అనిపిస్తుంది. ఏ పని చేయడానికి శక్తి లేదు అనిపిస్తుంది. చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేని పరిస్థితి వస్తుంది. విపరీతమైన ఒళ్ళు నొప్పులు బాధిస్తాయి. అంతేకాదు విటమిన్ డి లోపిస్తే చర్మం పొడిబారడం, దురదగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. విటమిన్ డీ లోపం ఎక్కువగా ఉన్నవారిలో జుట్టు రాలే సమస్య ప్రారంభమవుతుంది. ఎవరికైతే విటమిన్-డి లోపం ఎక్కువగా ఉంటుందో వారికి వ్యాధి నిరోధక శక్తి బలహీనపడుతుంది. ఫలితంగా జలుబు, దగ్గు మరియు జ్వరం వంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయి. పదేపదే అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఇక విటమిన్ డి లోపం వల్ల డిప్రెషన్ వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కూడా ఉంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు విటమిన్ డి లోపం కూడా కారణమని గ్రహించాలి. విపరీతంగా జాయింట్ పెయిన్స్ ఉంటే, విటమిన్ డి లోపం కావచ్చు అన్నది గుర్తించాలి. ఇలా నొప్పులు ఎక్కువగా వచ్చే వారు విటమిన్ డి లోపాన్ని సరి చేసుకోవాలి. ఇక విటమిన్ డి లోపంతో బాధపడేవారు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు తీసుకునే ఆహారంలో విటమిన్ డి పుష్కలంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఆహారంలో సోయాబీన్, గుడ్లు, చీజ్, సీజనల్ పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, చేపలు ఉండేలా చూసుకోవాలి. విటమిన్ డి శరీరానికి పుష్కలంగా అందాలంటే ప్రభాత సూర్యుని కిరణాలు మన శరీరంపై పడేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతీరోజూ ఉదయాన్నే కాసేపు సూర్య కాంతిలో తిరగాలి.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)