పంజాబ్‌లో రైతుల ఆందోళనతో 54 రైళ్లు రద్దు !

Telugu Lo Computer
0


పంజాబ్‌లో పోలీసులు అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతుల ఆందోళన బాట పట్టారు. అందులోభాగంగా వరుసగా నాలుగో రోజు పంజాబ్‌లోని శంభు రైల్వే స్టేషన్‌ రైల్వే ట్రాక్‌పైకి భారీగా రైతులు చేరుకున్నారు. దీంతో అంబాలా - అమృత్‌సర్ మార్గంలో 54 రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. అందులో న్యూఢిల్లీ-అమృత్‌సర్, రిషికేష్-శ్రీగంగానగర్, లూథియానా-అంబాలా కంటోన్మెంట్ రైళ్లు రద్దు అయిన వాటిలో ఉన్నాయని పేర్కొంది.   తాము పండించే పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్దమైన హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనిని ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించారు. ఆ క్రమంలో ఢిల్లీ ఛలో పాదయాత్రకు పిలుపునిచ్చారు. అందులోభాగంగా.. పిబ్రవరి 13వ తేదీన రైతులు చేస్తున్న పాదయాత్రను పంజాబ్, హర్యానాల మధ్య సరిహద్దు శంభు, ఖనౌరి వద్ద నిలిపివేశారు. నాటి నుంచి వారు అక్కడే ఉన్నారు. వారిలో నవదీప్, గుర్కిరాత్, అనీష్ ఖతర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో అనిష్ అరెస్ట్ అయిన నాటి నుంచి నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో అతడి ఆరోగ్యం రోజు రోజుకు క్షిణిస్తుంది. ఈ నేపథ్యంలో అతడి ఆరోగ్యంపై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఈ ముగ్గురు రైతులు విడుదలయ్యే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని రైతు నాయకుడు సర్వన్ సింగ్ స్పష్టం చేశారు.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)