కూటమి అభ్యర్థులకు చిరంజీవి మద్దతు ప్రకటించడం పట్ల తామేమీ ఆశ్చర్యపోవడంలేదు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో కూటమి అభ్యర్థులకు చిరంజీవి మద్దతు ప్రకటించడం పట్ల తామేమీ ఆశ్చర్యపోవడంలేదని, ఎవరు ఎవరికి మద్దతు ఇచ్చినా తమకు నష్టం లేదని  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఎంతమంది కలిసి వచ్చినా వైసీపీని ఓడించడం జరగదన్నారు. ఏపీ ఎన్నికల ముఖచిత్రంలో ఇప్పుడొక స్పష్టత వచ్చిందని, ఇటువైపు సీఎం జగన్ ఒక్కరే ఉన్నారన్నారు. పవన్ కళ్యాణ్ ఏమాత్రం పరిపక్వత లేని రాజకీయ నాయకుడని సజ్జల అన్నారు. పవన్ తీరు చూస్తుంటే చంద్రబాబు కోసమే పుట్టి, పెరిగినట్టున్నాడన్నారు. అనకాపల్లి లోక్‌సభ ఎంపీ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్, పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేశ్ హైదరాబాద్‌లోని మెగా స్టార్ చిరంజీవి నివాసంలో ఆయనను కలిశారు. సీఎం రమేశ్, పంచకర్ల రమేశ్‌లను గెలిపించాలని ఓటర్లను చిరంజీవి కోరారు. మ్ముడు పవన్ కల్యాణ్ కారణంగా చాలా కాలం తర్వాత రాజకీయల గురించి మాట్లాడుతున్నానన్నారు.. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ నాయకత్వం అందరూ మంచి కూటమిగా ఏర్పడ్డారని, ఇది శుభపరిణామమన్నారు. నా చిరకాల మిత్రుడు సీఎం రమేశ్, పంచకర్ల రమేశ్ నాకు కావాల్సిన ఇద్దరూ అనకాపల్లి లోక్‌సభ పరిధిలోనే పోటీ చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)