పరుగులు తీస్తున్న పసిడి, వెండి ధరలు !

Telugu Lo Computer
0

                        

సిడి ధరలు రోజురోజుకు ధర సరికొత్త గరిష్ఠాలను తాకుతున్నది. ధరల పెరుగుదలతో బంగారం అంటేనే సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ లో బుధవారం బంగారం ధర తులానికి రూ.440 పెరిగింది. ఏప్రిల్‌ ఫ్యూచర్స్‌లో పసిడి జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.69,487కి చేరుకుతున్నది. క్రితం సెషన్‌ ముగింపు ధరతో పోలిస్తే పోలిస్తే 0.64 శాతం పెరిగి రూ.69,369 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో ఎంసీఎక్స్‌లో సిల్వర్‌ ఫ్యూచర్స్‌ ఏకాలంలో రెండు సంవత్సరాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. కిలోకు రూ.77,957కు పెరిగింది. డాలర్‌ ఇండెక్స్‌ క్షీణించడం, యూఎస్‌ ఫెడలర్‌ రిజర్వ్‌ రేటు తగ్గింపు అంచనాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. డాలర్‌ ఇండెక్స్‌ (DXY) ప్రస్తుతం 104 మార్క్‌కు ఎగువన కొనసాగుతున్నది. కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ట్రాయ్ ఔన్స్‌కి 2,308 డాలర్ల వద్ద గరిష్ఠ స్థాయికి చేరింది. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతల కారణంగా బంగారం సానుకూలంగా ట్రేడవుతోంది. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ హెడ్ అనూజ్ గుప్తా మాట్లాడుతూ.. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపుపై ఆశలున్నాయని.. ఈ క్రమంలోనే ఇటీవల ధరలు పెరుగుతున్నాయన్నారు. కామెక్స్‌లో బంగారం 2,320 నుంచి 2,400 డాలర్లకు చేరుకోవచ్చన్నారు. ఎంసీఎక్స్‌లో 73,555 రేంజ్‌లో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)