సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలు తప్పే !

Telugu Lo Computer
0


నాతన ధర్మానికి సంబంధించి డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తప్పు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ''ఉదయనిధి మాట తప్పు.. అది ఆయన ఆలోచన, ఆయన మాటలకు శిక్ష అనుభవించాల్సిందే'' అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. టైమ్స్ నౌ గ్రూప్ ఎడిటర్ నవికా కుమార్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి పలు అంశాలపై రేవంత్ రెడ్డి మాట్లాడారు. డీఎంకేతో కాంగ్రెస్ పొత్తుపై ప్రశ్నలకు స్పందిస్తూ.. ''ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు తప్పు..ఆయన వ్యాఖ్యలు సరైనవని ఎవరు చెప్పారు?.. అది ఆయన మైండ్‌సెట్.. కుటుంబంలో సభ్యులు కూడా వివిధ రకాల ఆలోచనలతో ఉంటారు.. బీజేపీలో కూడా ఇలాంటివి ఉన్నాయి..'' అని రేవంత్ రెడ్డి సమాధానమిచ్చారు. ఉదయనిధి కామెంట్స్‌ను కాంగ్రెస్‌ నుంచి ఎవరు ఖండించలేదుగా అని అడగగా.. తాను టీపీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఆ వ్యాఖ్యలు తప్పని చెబుతున్న కదా? ఈ మాటలను ఎందుకు చూడటం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఏ ధర్మాన్ని అవమానించేలా మాట్లాడటమైనా తప్పేనని అన్నారు.అటువంటి వారిని శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం సూత్రాన్ని ప్రస్తావించిన రేవంత్ రెడ్డి.. మతపరమైన మనోభావాలను గౌరవించడం, ఏ ధర్మానికి హాని కలిగించకుండా అన్ని విశ్వాసాలను నిలబెట్టడం ముఖ్యమని చెప్పారు. ఉదయనిధి స్టాలిన్‌కు శిక్షపడాల్సిన అవసరం ఉందంటారా? అని అడగ్గా.. తప్పకుండా శిక్షపడాలని అన్నారు. వ్యవస్థ ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.. అయితే వ్యవస్థను మోదీ నాశనం చేశారని.. బీజేపీ నేతలు ఎంతో ఘోరమైన కామెంట్స్ చేశారని వారిపై చర్యలు ఏవని ప్రశ్నించారు. మహ్మద్ ప్రవక్తపై మాట్లాడితే కేవలం పార్టీ నుంచి సస్పెండ్ చేసి సరిపెట్టుకున్నారని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)