ఫేక్ న్యూస్ షేర్ చేసే ముందు జాగ్రత్తగా ఉండండి !

Telugu Lo Computer
0


కాంగ్రెస్ పార్టీ ముస్లిం మతాన్ని, ముస్లిం జాతిని నమ్ముతుందని, హిందూ మతంపై నమ్మకం లేదని, గతంలో కాంగ్రెస్ నేతలు పార్టీ లోగోను మార్చారని, కాంగ్రెస్ పార్టీ ముస్లిం ప్రాతిపదికన ఏర్పాటు చేశారని, హిందూ మతం మీద కాంగ్రెస్ కు నమ్మకం లేదని, హిందువుల ఓట్లపై మేము ఆదారపడటం లేదని, కాంగ్రెస్ కార్యకర్తలు హిందుత్వాన్ని నమ్మవద్దని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఓ ప్రైవేట్ మీటింగ్‌లో చెప్పారని కన్నడ మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రముఖ కన్నడ పత్రికలో వార్త ప్రచురించారని ఓ వార్త బయటకు రావడం కలకలం రేపింది. ఈ వార్తల విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య క్లారిటీ ఇచ్చారని వార్తలు వచ్చాయి. బీజేపీ-జేడీఎస్ కూటమి స్పాన్సర్ చేసిన ప్రకటనలను ఓ వార్తాపత్రిక తరహాలో ఫేక్ న్యూస్ సృష్టించారని, ప్రజల మనోభావాలను రెచ్చగొట్టే ఇలాంటి వార్తలను సోషల్ మీడియాలో వైరల్ చేశారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. దీనిపై ఇప్పటికే తాను కర్ణాటక పోలీసు శాఖకు ఫిర్యాదు చేశానని, దీని వెనుక ఉన్న దుష్టశక్తుల గురించి మా వద్ద సమాచారం ఉందని, వీలైనంత త్వరగా వారికి గుణపాఠం చెబుతామని సీఎం సిద్దరామయ్య తెలిపారు. తమ రాజకీయ ప్రత్యర్థులను నిష్పక్షపాతంగా ఎదుర్కోలేక ఇలా పక్కదారిలో లోక్ షభ ఎన్నికల్లో గెలుపొందడానికి బీజేపీ, జేడీఎస్ పార్టీలు కుట్రపన్నుతున్నాయని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆరోపించారు. బీజేపీ, జేడీఎస్ ల దివాళాకోరుతనాన్ని ఇలాంటి ఫేక్ న్యూస్ తెలియజేస్తోందని, పదేళ్లపాటు దేశాన్ని పాలించిన పార్టీ లోక్ సభ ఎన్నికల్లో గెలవడానికి ఫేక్ న్యూస్‌ను ఆశ్రయించే స్థాయికి చేరుకోకూడదని సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. ఫేక్ న్యూస్‌లను నమ్మి అలాంటి న్యూస్ షేర్ చేసే ముందు జాగ్రత్తగా ఉండండి అని సీఎం సిద్దరామయ్య ప్రజలకు మనవి చేశారు. ఫేక్ న్యూస్ సృష్టికర్తలు, వారికి వెన్నుదన్నుగా మద్దతు ఇచ్చేవారు ఇలాంటి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీని ఆశ్రయిస్తున్నారని, వారిని కచ్చితంగా నిర్మూలిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హెచ్చరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)