తెలంగాణ ఇంటర్‌ పరీక్షా ఫలితాలు విడుదల !

Telugu Lo Computer
0


తెలంగాణ ఇంటర్‌ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. కాసేపటి క్రితమే తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఈరోజు ఉదయం 11 గంటలకు ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 2, 87, 261 మంది ఉత్తీర్ణత సాధించారు. దీంతో 60.01 శాతంగా ఉత్తీర్ణత నమోదు అయింది. ద్వితీయ సంవత్సరం లో 3,22,432 మంది పాస్ అయి… 64.19% ఉత్తీర్ణత శాతం నమోదు అయింది. తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫలితాలలో మహిళలదే పైచేయి అని విద్యాశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం ప్రకటించారు. ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్ సైట్ https://tsbie.cgg.gov.in/ లో ఇంటర్‌ పరీక్ష ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చును.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)