వందే భారత్ స్లీపర్ కోచ్‌లో అత్యాధునిక సదుపాయాలు !

Telugu Lo Computer
0

                                           

వందే భారత్ స్లీపర్ రైలు వస్తోంది. ఇందులో 16 కోచ్‌లు ఉంటాయి. ఏసీ 3 టైర్‌లో 11 కోచ్‌లు, ఏసీ 2 టైర్‌కు చెందిన 4 కోచ్‌లు ఉంటాయి. ఈ రైలులో 823 మంది ప్రయాణించవచ్చు. ఏసీ 3వ టైర్‌లో 611 మంది, ఏసీ రెండో టైర్‌లో 188 మంది, ఏసీ 1వ టైర్‌లో 24 మంది ప్రయాణించవచ్చు. స్లీపర్ AC 3 టైర్ కోచ్‌లో ప్రయాణీకులకు మంచి సౌకర్యాలను కల్పిస్తోంది. ప్రతి బెర్త్‌కు ప్యాడ్ ఫీచర్ ఉంటుంది. అలాగే, రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పోలిస్తే బెర్త్ మ్యాట్రెస్‌లు మరింత సౌకర్యవంతంగా ఉండబోతున్నాయి. వందే భారత్‌లోని స్లీపర్ ఇంటీరియర్ మెరుగుపర్చారు. ఈ రైలులో ఎగువ, మధ్య బెర్త్ చేరుకోవడానికి మెట్లను మెరుగుపర్చింది. దీంతో సీనియర్ సిటిజన్లు ఎగువ, మధ్య బెర్త్‌లకు సులభంగా చేరుకోవచ్చు. వందే భారత్ స్లీపర్ కోచ్‌లలో లైట్ సెన్సార్లు ఉండబోతున్నాయి. రైలు ఒక కోచ్ నుండి మరొక కోచ్‌కు వెళ్లడానికి ఆటోమేటిక్ డోర్లు ఉంటాయి. ఈ రైలులో బయో-వాక్యూమ్ టాయిలెట్లు అమర్చనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)