బ్రెయిన్ స్ట్రోక్ - లక్షణాలు !

Telugu Lo Computer
0


మెదడుకు సరిగ్గా రక్తప్రసరణ జరగకపోయినా, లేదా మెదడుకు రక్తప్రసరణ నిలిచిపోయినా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా భవిష్యత్తులో మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే వీటిని ముందుగానే గుర్తించాల్సిన అవసరం ఉంది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు కచ్చితంగా కనిపిస్తాయి. వాటిని గుర్తిస్తే తీవ్రమైన ప్రమాదం బారిన పడకుండా మన శరీరాన్ని కాపాడుకోవచ్చు .బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు శరీరం మొత్తం బలహీనంగా మారుతుంది. శరీరమంతా తిమ్మిర్లు వచ్చినట్టుగా అనిపిస్తుంది. మాటలు నత్తిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా చెప్పేటప్పుడు కూడా కన్ఫ్యూజన్ కు గురవుతారు. మెదడుకు ఆలోచించే సామర్థ్యం తగ్గిపోతుంది. చూపు మందగిస్తుంది. ఒక్కోసారి రెండు కళ్ళు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. విపరీతమైన తలనొప్పి వస్తుంది. ముఖంలో మార్పు వస్తుంది. ఒక వైపుకు ముఖం జారిపోయినట్టుగా మారుతుంది. స్ట్రైట్ గా నిలబడడంలోను ఇబ్బంది వస్తుంది. శరీరంపై అదుపు తప్పుతుంది. చేతులు కూడా బలహీనంగా మారుతాయి. బ్రెయిన్ స్ట్రోక్ తీవ్రంగా ఉన్నప్పుడు స్పృహ కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ ను సంప్రదిస్తే బ్రెయిన్ స్ట్రోక్ రాకుండానే కాపాడే అవకాశం ఉంటుంది. 


Post a Comment

0Comments

Post a Comment (0)