అనిల్‌ భాయ్‌ తో సెల్ఫీలకు ఎగబడుతున్న జనం !

Telugu Lo Computer
0


పానీ పూరి బండి నడిపే 71 ఏళ్ల వృద్ధుడితో సెల్ఫీల కోసం జనం ఎగబడుతున్నారు. ఆయన పేరే గుజరాత్‌కు చెందిన అనిల్‌ భాయ​ ఠక్కర్‌. ఈ పానీ పూరీ వాలా ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాడు. గుజరాత్‌కు చెందిన అనిల్ భాయ్ ఠక్కర్ మాత్రం తన సైడ్ ప్రొఫైల్, హెయిర్‌స్టైల్, తెల్లటి గడ్డం, ఆఖరికి డ్రెస్సింగ్‌ స్టయిల్‌ కూడా అచ్చం ప్రధాన మంత్రి మోడీ పోలికలతో కస్టమర్లను కట్టిపడేస్తున్నాడు. ఈయన గుజరాత్‌లోని ఆనంద్‌లో 'తులసి పానీ పూరీ సెంటర్‌'ను నడుపుతున్నాడు. అచ్చం మోడీలా ఉన్న అనిల్ భాయ్‌నును స్థానికులంతా పీఎం మోడీ అని పిలుచుకుంటారు. ప్రధాని మోడీ పోలికల కారణంగా స్థానికులు, పర్యాటకుల నుండి తనకు చాలా ప్రేమ , గౌరవం లభిస్తోందని అనిల్‌ భాయ్‌ ఆనందంగా ఉందని అంటున్నాడు. 

Post a Comment

0Comments

Post a Comment (0)