చేతులెత్తి నమస్కరిస్తున్నా....వరుణలో 60 వేల మెజార్టీ ఇవ్వండి !

Telugu Lo Computer
0


ర్నాటక లోని చామరాజనగర్ లోక్ సభ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని సిద్దరామయ్య కోరారు. వరుణ అసెంబ్లీ నియోజకవర్గం చామరాజనగర్ పరిధిలో ఉంటుంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ధృవ నారాయణ చామరాజనగర్ నుంచి కేవలం 1817 ఓట్లతో ఓడిపోయారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను 48 వేల ఓట్లతో విజయం సాధించానని సిద్దరామయ్య గుర్తుచేశారు. ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో మంత్రి మహాదేవప్ప కుమారుడు సునీల్ బోస్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. సునీల్‌ను 60 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని సిద్దరామయ్య కోరారు. సిద్దరామయ్య నియోజకవర్గంలో అభ్యర్థి ఓడిపోతే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. సొంత నియోజకవర్గంలో అభ్యర్థిని గెలిపించుకోలేక పోయావనే అపప్రద మూట గట్టుకుంటారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు తప్పదని గుసగుసలు వినిపిస్తున్నాయి. పక్కలో బల్లెంలా డీకే శివకుమార్ కాచుకొని కూర్చొన్నాడు. లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోతే దానిని అనుకూలంగా మార్చుకుంటారని సిద్దరామయ్య లోలోన భయ పడుతున్నారు. చేతులెత్తి అభ్యర్థిస్తున్నా సునీల్ బోస్‌కు 60 వేల ఓట్ల మెజార్టీ ఇవ్వాలని విన్నవించారు. కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సీఎం పోస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. సమయం దొరికితే చాలు ముఖ్యమంత్రి పదవి గురించి మాట్లాడుతున్నారు. ఇటీవల మాండ్యలో డీకే శివకుమార్ మాట్లాడుతూ.. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఎందుకు మద్దతు ఇచ్చారో అందరికీ తెలుసు. తన మనసులో ముఖ్యమంత్రి పదవి ఉంది.. మీరు ఇచ్చిన తీర్పు ఎప్పటికీ తప్పుగా మారదు. లోక్ సభ ఎన్నికల తర్వాత లేదంటే రెండున్నరేళ్ల  తర్వాత ముఖ్యమంత్రి మార్పు ఖాయం అనే వార్తలు వస్తున్నాయి. డీకే కామెంట్లతో అది నిజం అయ్యేలా అనిపిస్తోందని విశ్లేషణలు వస్తున్నాయి. వరుణ ప్రజలతో సిద్దరామయ్య మనసు విప్పి మాట్లాడారు. 'మీకు నేను ఎవరో తెలుసు. మంత్రి మహాదేవప్ప చాలా బాగా తెలుసు. వరుణ అసెంబ్లీ నుంచి గతంలో తన కుమారుడు యతీంద్ర ప్రాతినిధ్యం వహించాడు. మేమందరం తెలిసినందున సునీల్ బోస్‌కు కనీసం 60 వేల ఓట్ల మెజార్టీ రావాల్సి ఉంది. అలా జరిగితే తనకు సంతోషంగా ఉంటుంది. ఆ తర్వాత తనను టచ్ చేసే ధైర్యం ఎవరు చేయరు. నేను ముఖ్యమంత్రిగా ఉండాలా..? వద్దా..? చేతులెత్తి నమస్కరిస్తున్నా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మంచి మెజార్టీ ఇవ్వండి. గెలిచిన తర్వాత వచ్చి మళ్లీ మిమ్మల్ని కలుస్తాను అని' సిద్దరామయ్య కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)