ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలి !

Telugu Lo Computer
0


రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం కీల కర్తవ్యమని, ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్‌ 'మై ఓట్‌ మై వాయిస్‌' మిషన్‌కు ఆయన వీడియో సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత పౌరులమని రాజ్యాంగం పౌరులైన మనకు అనేక హక్కులు కల్పించిందన్నారు. ప్రతి ఒక్కరూ తనకు అప్పగించిన కర్తవ్యాన్ని నిర్వర్తించాలన్నారు. పౌరులకు రాజ్యాంగం కల్పించిన విధుల్లో ఒకటి ఓటు వేయడమన్నారు. గొప్ప మాతృభూమి పౌరులుగా బాధ్యతాయుతంగా ఓటు వేసే అవకాశాన్ని వదులుకోవద్దని అందరినీ అభ్యర్థిస్తున్నానన్నారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఐదు నిమిషాలు కేటాయించవచ్చని.. గర్వంగా ఓటు వేయాలని సీజేఐ పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో పౌరులకు పాత్ర ఉందని, అందుకే రాజ్యాంగంలో 'భారత ప్రభుత్వం ప్రజలచే.. ప్రజల కొరకు' అని రాసుందన్నారు. ఈ సందర్భంగా సీజేఐ ఆయన తొలిసారిగా ఓటరుగా ఓటు వేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. పోలింగ్‌ బూత్‌ వద్ద క్యూలో నిలబడి ఉన్నప్పుడు ఎంతో ఉత్సాహంగా అనిపించిందన్నారు. న్యాయవాదిగా పని చేస్తున్న సమయంలో ఓటు వేయడంలో విఫలం కాలేదన్నారు. 

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)