ఒడిశాలో బీజేడీతో బీజేపీ పొత్తు ?

Telugu Lo Computer
0


డిశాలో బిజూ జనతాదళ్ తో లోక్‌సభ ఎన్నికల పొత్తులకు బీజేపీ పావులు కదుపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒడిశాలో 21 లోక్‌సభ స్థానాలు ఉండగా, 2019 ఎన్నికల్లో బీజేడీ 12 సీట్లు, బీజేపీ 8 సీట్లు గెలుచుకోగా, ఒక సీటు కాంగ్రెస్ గెలుచుకుంది. ఈసారి కూడా బీజేడీ, బీజేపీ మధ్య నువ్వా-నేనా అనే రీతిలో పోటీ ఉంటుందని, బీజేడీ 11, బేజీపీ 10 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయని సర్వేలు అంచనా వేస్తున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారంనాడు ఒడిశాలో పర్యటన సందర్భంగా రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యతను బలంగా చెప్పారు. వికసిత్ భారత్, ఆత్మ నిర్బర్ భారత్‌కు గేట్‌వేగా ఒడిశాను తీర్చిదిద్దేందుకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒడిశాలో గత పదేళ్లుగా కేంద్ర భారీగా పెట్టుబడులు పెడుతోందన్నారు. రాష్ట్రంలోని ఒక్క పెట్రో కెమికల్ సెక్టార్‌లోనే రూ.2 లక్షల కోట్లు వెచ్చించామన్నారు. ఎక్కువ పెట్టుబడులు పెట్టడం అంటే రాష్ట్ర యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించడమేనని చెప్పారు. 'ఇండియా' బ్లాక్ పార్టీల సిద్ధాంతం కుటుంబ సిద్ధాంతమని, మోదీ ఐడియాలజీ మాత్రం 'నేషన్ ఫస్ట్' అని చెప్పారు. తన ప్రసంగంలో ఎక్కడా బిజూ జనతాదళ్‌ను కానీ, నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని కానీ ఆయన విమర్శించలేదు. బీజేడీ విషయంలో మోదీ మౌనం వెనుక ఒడిశాలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచన ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)