పాపువా న్యూ గినియాలో భారీ భూకంపం !

Telugu Lo Computer
0


త్తర పాపువా న్యూ గినియాలోని అంబుంటిలో ఆదివారం తెల్లవారుజామున 6.9 తీవ్రతతో  భారీ భూ ప్రకంపనలు సంభవించాయని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంప కేంద్ర అంబుంటికి తూర్పు-ఈశాన్యంగా 38 కిలో మీటర్ల దూరంలో 40.2 కి.మీ లోతులో ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. ఈ భూకంప ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. కాగా, రింగ్ ఆఫ్ ఫైర్ పై ఉండడంతో పాపువా న్యూ గినియాలో భూకంపాలు ఎక్కువగా జరుగుతుంటాయి. గత ఏడాది ఏప్రిల్‌లో 7.0 తీవ్రతతో సంభవించిన భూకంపంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు.

Post a Comment

0Comments

Post a Comment (0)