అక్రమ సిమ్ కార్డుల రద్దుకు కేంద్రం ఆదేశాలు !

Telugu Lo Computer
0


దేశంలో ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్స్ యూస్ చేస్తూనే ఉన్నారు. పైగా ప్రతి ఒక్కరి దగ్గర కనీసం రెండు సిమ్స్ ఉంటున్నాయి. మరి కొంతమంది దగ్గర అంతకుమించి కూడా ఉంటున్నాయి. వాటితో ఎన్నో అక్రమాలకు పాల్పడే వారు కూడా ఉన్నారు. దేశంలో దాదాపు 21 లక్షలకు పైగా.. సిమ్ కార్డ్స్.. తప్పుడు/ నకిలీ ప్రూఫ్స్ తో ఉన్నట్లు.. స్కామ్స్ బయట పడుతున్నాయి. ఈ క్రమంలో దీనికి సంబంధించి డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ .. ఎయిర్‌టెల్, MTNL, BSNL, జియో సహా వొడాఫోన్ ఐడియా సంస్థలకు అలర్ట్ జారీ చేసింది. ఇప్పటివరకు వేల సంఖ్యలో.. అనుమానాస్పద నంబర్స్ లిస్ట్ ను విడుదల చేసింది. వాటిని రీవెరిఫికేషన్ చేసి.. అవి కనుక బోగస్ ప్రూఫ్స్ అని తెలిస్తే.. వాటిని వెంటనే రద్దు చేయాలని తెలిపింది డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ సంస్థ. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 114 కోట్ల మొబైల్ కనెక్షన్లను డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ సంస్థ, ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ ద్వారా విశ్లేషించింది. వీటిల్లో మొత్తం 21 లక్షల వరకు సిమ్ కార్డ్స్ ను యాక్టివేట్ చేసుకునేందుకు.. ఫేక్ ప్రూఫ్స్ సమర్పించినట్లు గుర్తించింది. అందులోను చాలా వరకు ఈ ఫేక్ ప్రూఫ్స్ తో తీసుకున్న సిమ్ కార్డ్స్ ను సైబర్ నేరగాళ్లు వాడుతున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తోంది. ఒకవేళ ఇది కనుక నిజమైతే.. ఆ సిమ్ కార్డును రద్దు చేయడమే కాకుండా.. ఆ ఫోన్ కూడా పనిచేయకుండా చేస్తామని.. ఏఐ అండ్ డీఐయూ డైరెక్టర్ జనరల్ ముకేశ్ మంగళ్ తెలిపారు. అంటే, సిమ్ బ్లాక్ చేయడమే కాకూండా ఆ మొబైల్ కూడా పనిచేయకుండా పోతుందనే క్లారిటీ ఇచ్చారు.  ఇప్పటికే.. 1.92 కోట్ల మంది 9 సిమ్ కార్డ్స్ ను పరిమితికి మించి.. కనెక్షన్స్ తీసుకున్నట్లు గుర్తించారు. అయితే, వారు సర్వీస్ ప్రొవైడర్స్ కు ఇచ్చిన డేటాలో మాత్రం చాలా తప్పులు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు ఇలా ఫేక్ ప్రూఫ్స్ తో తీసుకున్న సిమ్ కార్డ్స్ ను వారికీ తెలియకుండానే.. బ్లాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. ఈ నెంబర్స్ పై పూర్తి ఇన్ఫర్మేషన్ ను సేకరించేందుకు.. ఇప్పటికే డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ సంస్థ.. సర్వీస్ ప్రొవైడర్లకు డెడ్‌లైన్ విధించింది. ఈ క్రమంలో చాలా పెద్ద సంఖ్యలో సిమ్ కార్డ్స్ డిస్ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని.. ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఈ మొత్తం ఆపరేషన్ ను AI&DIU సంస్థ ఇతర చట్ట సంస్థలతో కలిసి పూర్తి చేస్తోంది. మరో వైపు సైబర్ నేరగాళ్లు పోలీసులు.. తమ నెంబర్స్ ను ట్రాక్ చేసేందుకు వీలు లేకుండా వాటిని ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)