ఇజ్రాయిల్ పౌరుల్ని అనుమతించని దేశాలు ?

Telugu Lo Computer
0


టీవల ఇజ్రాయిల్‌కి సంబంధించిన ఓ పోస్టు తెగవైరల్ అవుతోంది. ఇజ్రాయిల్ పాస్‌పోర్టు కలిగిన వారిని అనుమతించని దేశాల లిస్టు వైరల్ అయింది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనే పేజీలో ఇజ్రాయిల్ పౌరులను తమ గడ్డపైకి అనుమతించనని దేశాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం ముస్లిం మెజారిటీ కలిగిన దేశాలు ఉన్నాయి. అల్జీరియా, బంగ్లాదేశ్, బ్రూనై, ఇరాన్, ఇరాక్, కువైట్, లెబనాన్, లిబియా, పాకిస్తాన్, సౌదీ అరేబియా, సిరియా, యెమెన్ ఉన్నాయి. అయితే, ఈ జాబితాపై ఇజ్రాయిల్ స్పందించింది. ''వి ఆర్ గుడ్'' అని కామెంట్ చేసింది. ఇజ్రాయిల్ చట్టం ప్రకారం లెబనాన్, సిరియా, యెమెన్, ఇరాన్ శత్రు దేశాలుగా పేర్కొనబడ్డాయి. ఇజ్రాయిల్ పౌరులు ఈ దేశాలను సందర్శించాలంటే ఇజ్రాయిల్ అంతర్గత మంత్రిత్వ శాఖ నుంచి ప్రత్యేక అనుమతి పొందాలి. ఇజ్రాయిలీలకు వీసా రహిత ప్రయాణాన్ని అనుమతించే ఏకైక మిడిల్ ఈస్ట్ దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది. ఈ పోస్టు వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇజ్రాయిల్‌ని ద్వేషిస్తుండగా మరికొందరు సపోర్టు చేస్తున్నారు. 2024 నాటికి, ఇజ్రాయిల్ పాస్‌పోర్టు కలిగిన పౌరులకు 171 దేశాలు వీసా-ఫ్రీ లేదా వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం ఇజ్రాయెల్ పాస్‌పోర్ట్ ప్రపంచంలో 20వ స్థానంలో ఉంది. అధిక మొబిలిటీ స్కోర్‌తో, ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ ర్యాంకింగ్ పాస్‌పోర్ట్‌లలో ఒకటి. ఇజ్రాయిల్ పాస్‌పోర్టు హోల్డర్లు ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ దేశాలు, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రయాణించొచ్చు. చైనా, భారత్, అమెరికా వంటి దేశాలకు ముందుగా వీసా అఫ్లై చేసుకోవాలి. 

Post a Comment

0Comments

Post a Comment (0)