గోడౌన్‌లో వూడ్చుతున్న మహిళపై జారిపడిన బస్తాలు !

Telugu Lo Computer
0


ముంబైలోని వాషి ప్రాంతంలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ) గోడౌన్‌లో వూడ్చుతున్న మహిళపై బస్తాలు జారి పడ్డాయి. ఆ బస్తాల మధ్య చిక్కుకున్న ఆమె సహాయం కోసం కేకలు వేసింది అక్కడే ఉన్న కూలీలు వెంటనే స్పందించారు. క్షణాల్లో బస్తాలను తొలగించారు. వాటి కింద చిక్కుకున్న ఆ మహిళను కాపాడారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అక్కడ వరుసగా పేర్చిన సుమారు 50 బస్తాలు జారి ఆ మహిళపై పడ్డాయి. గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Post a Comment

0Comments

Post a Comment (0)