కస్టడీలో క్షీణించిన కేజ్రీవాల్ ఆరోగ్యం ?

Telugu Lo Computer
0


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయి ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. మధుమేహంతో బాధపడుతున్న ఆయనకు కస్టడీలో షుగర్ లెవల్స్ దారుణంగా పడిపోయాయని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు ఆరోపించాయి. ''చక్కెర స్థాయిల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటున్నట్లు తెలుస్తోంది. ఒక దశలో షుగర్ లెవల్ 46ఎంజీ స్థాయికి పడిపోయింది. ఇది అత్యంత ప్రమాదకర పరిస్థితి అని వైద్యులు చెబుతున్నారు'' అని ఆప్ వర్గాలు పేర్కొన్నాయి. అంతకుముందు కేజ్రీవాల్ సతీమణి సునీత కూడా తన వీడియో సందేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ''ఈడీ కస్టడీలో ఉన్న ఆయనను కలిసినప్పుడు షుగర్ లెవల్స్ పడిపోతున్నట్లు చెప్పారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిద్దాం'' అని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)