పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు ఆసుపత్రి బెడ్ ఎక్కాడు !

Telugu Lo Computer
0

పెళ్లి మండపానికి గుర్రపు రథంలో వెళ్తున్న వరుడికి అనుకోని ప్రమాదం ఎదురైంది. పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు ఆస్పత్రి బెడ్ ఎక్కాడు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను ఇన్ స్టా నుంచి @the_professor_13_15 అనే ఐడీతో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో వరుడు గుర్రపు రథం నుంచి పడిపోవడం చూడవచ్చు. పెళ్లి మండపానికి అని బయల్దేరిన వరుడు అతనితో పాటు కొందరు ప్రమాదవశాత్తు రథంపై నుంచి కిందపడిపోయారు. గుర్రపు రథంలో వస్తున్న వారు ఓ సర్కిల్ దగ్గరికి రాగానే గుర్రాలు భయపడిపోయాయి. ఒక గుర్రం మరొక గుర్రాన్ని లాగి గుంతలో పడేశాయి. గుర్రం రథంలో కూర్చున్న వారు తాడుతో ఎంత లాగినా వినకుండా కాలువలోకి పడేసింది. దీంతో ఒక్కసారిగా గుర్రపు రథం కూడా కాలువలో పడిపోయింది. ఈ వీడియోలో చూస్తే.. దానిపై కూర్చున్న వారికి తీవ్రగాయాలు అయి ఉండొచ్చని తెలుస్తోంది. అయితే.. ఈ వీడియోను 8 లక్షలకు పైగా మంది వీక్షించారు. అంతేకాకుండా ఈ వీడియోపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)