ఏప్రిల్‌ ఒకటి నుంచి తెలంగాణలో వడగాల్పులు

Telugu Lo Computer
0


తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. శుక్రవారం ఆదిలాబాద్‌లో 43.3, నల్గొండ జిల్లా నాంపల్లిలో 43, గద్వాల్‌ 42.8, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా దనొరాలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్టు రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ తెలిపింది. ఏప్రిల్‌ 1, 2 తేదీల్లో రాష్ట్రంలో వడగాల్పులు వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒకటిన కుమురంభీం ఆసిఫాబాద్‌,ఆదిలాబాద్‌,ఖమ్మం, మంచిర్యాల,కరీంనగర్‌, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్‌, నిజామాబాద్‌, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)