భారీగా పెరిగిన అనిల్ అంబానీ షేర్లు ?

Telugu Lo Computer
0


కప్పుడు ప్రపంచ కుబేరుడిగా ఉన్న అనిల్ చాలా కాలం మీడియాకు కనిపించకుండా కనుమరుగైన సంగతి తెలిసిందే. ఇటీవల్ అనంత్ అంబానీ పెళ్లిలో తిరిగి తళుక్కుమన్నారు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ కంపెనీ షేర్లు తిరిగి పుంజుకున్నాయి. బుధవారం కంపెనీ షేర్లు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ తాకి రూ.23.83 స్థాయికి చేరుకున్నాయి. గడచిన 5 రోజుల్లో కంపెనీ షేర్లు ఏకంగా 20 శాతానికి పైగా పెరుగుదలను నమోదు చేశాయి. దీనికి అసలు కారణం.. రిలయన్స్ పవర్ గత వారం ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, డీబీఎస్ బ్యాంక్‌లకు చెల్లించాల్సిన రుణాన్ని సెటిల్ చేశారు. ఇక కంపెనీ పుస్తకాల ప్రకారం ఇక చెల్లించాల్సింది కేవలం ఐడీబీఐ బ్యాంక్ నుంచి తీసుకున్న వర్కింగ్ క్యాపిటల్ లోన్ మాత్రమేనని, ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ పూర్తిగా రుణ విముక్తిని పొందాలనుకుంటోందని తెలుస్తోంది. పవర్ షేర్లు గత 4 ఏళ్ల కాలంలో విపరీతమైన పెరుగుదలను చూసాయి. ఈ కాలంలో కంపెనీ షేర్లు దాదాపు 2000% మేర పెరిగాయి. రిలయన్స్ పవర్ షేర్లు మార్చి 27, 2020న కేవలం రూ.1.13 రేటు వద్ద ట్రేడవుతున్నాయి. అనిల్ అంబానీకి చెందిన కంపెనీ షేర్లు నేడు రూ.23.83కి చేరుకున్నాయి. గత ఏడాది కాలంలో రిలయన్స్ పవర్ షేర్లు దాదాపు 130% పెరిగాయి. ఈ క్రమంలో కంపెనీ షేర్ల 52 వారాల గరిష్ఠ స్థాయి ధర రూ.33.10 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ స్థాయి ధర రూ.9.05గా ఉంది. రిలయన్స్ పవర్ మాతృసంస్థ రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా జేసీ ఫ్లవర్స్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీకి చెందిన రూ.2,100 కోట్ల బకాయిలను చెల్లించేందుకు సిద్ధమవుతోంది. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేర్లు కూడా బుధవారం 2% పెరిగి రూ.248.10కి చేరాయి. గత 4 ఏళ్ల కాలంలో రిలయన్స్ ఇన్‌ఫ్రా షేర్లు దాదాపు 2550% పెరిగాయి. మార్చి 27, 2020న కంపెనీ షేర్లు రూ.9.20 వద్ద ఉండగా.. నేడు ఇంట్రాడేలో ఒక్కో షేరు ధర రూ.248.10కి చేరుకుంది. రిలయన్స్ ఇన్‌ఫ్రా షేర్ల 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.264 వద్ద ఉంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)