సామూహిక వివాహాలలో వెలుగు చూసిన మోసం !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌ లోని ఝాన్సీ జిల్లాలో పెళ్లి సమయానికి వరుడు రాకపోవడంతో యువతి తన బావను వివాహం చేసుకుంది. అతడికి అది వరకే పెళ్లి అయింది. అయినా అందరూ కలిసి నిర్ణయించుకుని ఆ పెళ్లి  చేసేశారు. ఇలా చేయడం వెనుక ఉన్న మతలబు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఝాన్సీలోని బామౌర్‌కు చెందిన ఖుషీ అనే యువతికి మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్‌కు చెందిన వృషభన్‌తో వివాహం నిశ్చయమైంది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది సామూహిక వివాహాలు జరిపించి ఒక్కో జంటకు రూ.51 వేలు చొప్పున అందిస్తుంటుంది. ఆ సామూహిక వివాహ వేడుకలో పెళ్లి చేసి పథకం ప్రయోజనాలు అందుకోవాలని ఖుషీ కుటుంబ సభ్యులు భావించారు. అయితే ముహూర్త సమయానికి వృషభన్ అక్కడకు చేరుకోలేకపోయాడు. దీంతో ఖుషీ కుటుంబ సభ్యులు అప్పటికప్పుడు మరో యువకుడిని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టారు. ఆ యువకుడు ఖుషీకి బావ అవుతాడు. అతడికి అప్పటికే వివాహం జరిగిపోయింది. అయినా రూ.51 వేలు రాకుండా పోతాయని ఖుషీ కుటుంబ సభ్యులు అలా ప్లాన్ చేసి పెళ్లి చేసేశారు. పేర్లు నమోదు చేసుకునే సమయంలో అధికారులకు అనుమానం వచ్చింది. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు వరుడి పేరు, ఆధార్ నెంబర్ వేరుగా ఉండడడంతో వారికి డౌట్ వచ్చి ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. పథకం ప్రయోజనాల కోసం ఈ డ్రామాకు తెరలేపినట్లు గ్రహించిన అధికారులు వెంటనే విచారణకు అదేశించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. వధువు ఖుషీ కుటుంబానికి ఇచ్చిన అన్ని బహుమతులు, ఇతర సామగ్రిని వెనక్కి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)