తెలంగాణ అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యం !

Telugu Lo Computer
0


తెలంగాణలోని  సిరిసిల్ల పట్టణంలోని ముస్లిం షాదీఖానాలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కేటీఆర్ పాల్గొని మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ కాలంలో 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా మతం పేరుతో రాజకీయం చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. పేదవాడు ఏ మతస్తుడైనా కూడా మనిషిలా లాగా చూసి వారికి కావలసిన వసతులు కేసీఆర్ అందించారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మైనారిటీ గురుకుల పాఠశాలలో 1,32,000 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. అలాగే 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ను పేద మైనారిటీ విద్యార్థులకు అందజేశామని పేర్కొన్నారు. గత పది సంవత్సరాల్లో దేశ వ్యాప్తంగా మత కల్లోలాలు, అల్లర్లు జరిగినా.. కేసీఆర్ పాలనలో మాత్రం అన్ని మతాల వారు కలిసి మెలిసి ఉన్నారని గుర్తుచేశారు. దేశంలో అభివృద్ధి కావాలన్నా.. శాంతి రావాలన్నా కేపీఆర్ లాంటి నేత చాలా అవసరం అని కేటీఆర్ వ్యా్ఖ్యానించారు. ఈ ఇఫ్తార్ విందులో స్థానిక బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)