నాకు అవకాశాలు ఇవ్వండి : ఆశిష్ విద్యార్థి !

Telugu Lo Computer
0


సినీ నటుడు ఆశిష్ విద్యార్థి 'పాపే నా ప్రాణం' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. భాషతో సంబంధం లేకుండా కన్నడ, తమిళ, మలయాళం, బెంగాలీ, ఒడియా, ఇంగ్లీష్ లో ఎన్నో చిత్రాలలో చేసి ప్రేక్షకులను మెప్పించాడు. మహేశ్ బాబు నటించిన ‘పోకిరి’ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ లో నటించిన ఆశిష్.. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇటీవల ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో కనిపించిన ఆయన తర్వాత తెలుగులో ఒక్క సినిమా కూడా చెయ్యలేదు. ఒకప్పుడు ఇండస్ట్రీలో ‘ఫుల్ బిజీగా దూసుకుపోయిన నటుడ, నేడు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, నేను బతికే ఉన్నాను. నాకు కూడా అవకాశాలు ఇవ్వండి. నన్ను గుర్తించి ఆఫర్ల ఇవ్వండి అంటూ కామెంట్లు చేశాడు. ఆశిష్ చేసిన కామెంట్లు నెట్టింట తీవ్ర దుమారం రేపాయి. ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో నటించిన ఆయనకు ఇప్పుడు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటని చాలా మంది ఆశ్చర్యపోయారు. దీంతో సోషల్ మీడియాలో ఎన్నో కామెంట్లు వచ్చాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)