మాజీ మంత్రి దయాకరరావుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యాపారి ఫిర్యాదు !

Telugu Lo Computer
0


తెలంగాణ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుపై హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి శరణ్ చౌదరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దయాకర్ రావు తనను అక్రమంగా నిర్బంధించి తన సమీప బంధువు విజయ్ పేరిట బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు రోజులపాటు తనను అక్రమంగా నిర్బంధించడమే కాకుండా, రూ.50 లక్షలు ఇవ్వాలంటూ తన కుటుంబ సభ్యులను బెదిరించారని ఆరోపించారు. దీంతో తన స్నేహితుడు రూ.50 లక్షలు వీరికి అందజేశారని, అనంతరం తనను వదిలిపెట్టారని పేర్కొన్నారు. ఈ ఘటనపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేశానని, అయితే ఏసీపీ ఉమా మహేశ్వర్‌ రావు తన వద్దకు పోలీసులను పంపి బెదిరించడంతో ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నానని వివరించారు. 2023 ఆగస్టు 21న తాను ఆఫీస్‌కు వెళ్తుండగా సివిల్ దుస్తుల్లో కొందరు వ్యక్తులు తనను అడ్డగించి తాము పోలీసులమని చెప్పి సీసీఎస్‌కు తీసుకెళ్లారని వివరించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు, డీసీసీ రాధా కిషన్ రావు సూచనల మేరకు తనను పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించి కొట్టారని ఫిర్యాదులో ఆయన వివరించారు. పలువురి నుంచి అక్రమంగా నగదు డిపాజిట్లు సేకరించినట్లు తనపై ఏసీపీ ఉమా మహేశ్వరరావు కేసు నమోదు చేస్తానంటూ బెదిరించారని ఈ సందర్బంగా వివరించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని వ్యాపారి శరణ్ చౌదరి కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)