ప్రణీత్ రావు ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ !

Telugu Lo Computer
0



ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితును కస్టడీకి అప్పగించాలంటూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ నిమిత్తం అడిషనల్ ఎస్పీలు భుజంగ రావు, తిరుపతన్న, ప్రణీత్ రావులను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. విచారణ నిమిత్తం అడిషనల్ ఎస్పీలు భుజంగ రావు, తిరుపతన్న, ప్రణీత్ రావులను  కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. అయితే నిందితులు తరపు న్యాయవాదులు స్పందిస్తూ.. కస్టడీ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని కోరారు. రేపటి (బుధవారం) లోగా పిటిషన్ దాఖలు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. దీంతో కేసును రేపటికి వాయిదా వేసింది. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ప్రణీత్ రావు, ఏ-2గా భుజంగ రావు, ఏ-3గా తిరుపతన్న ఉన్నారని, వీరి ముగ్గురిని కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోరారు. ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రణీత్ రావు కస్టడీ ఇప్పటికే ముగిసింది. అయితే భుజంగ రావు, తిరుపతన్నతో పాటు ప్రణీత్‌ను మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. మరోవైపు ఫోన్ టాపింగ్  వ్యవహారంలో తవ్వేకొద్ది నిజాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న అధికారుల గురించి షాకింగ్ విషయం ఒకటి బయటికొచ్చింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అధికారులు భారీగానే అక్రమ ఆస్తులు కూడా బెట్టుకున్నారని తెలియవచ్చింది. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ (ACB).. ట్యాపింగ్ ద్వారా వ్యాపారులు, హవాలా ముఠాలను బెదిరించి వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లుగా తేలినట్లు సమాచారం. ఈ డబ్బుతో భారీగానే ఆస్తులు కూడబెట్టుకున్నట్లు దర్యాప్తులో తేలిందట. అంతేకాదు.. విలాసవంతమైన విల్లాల్లో ఆ అధికారులు నివాసం ఉంటున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఏసీబీ చేతికి వెళ్లింది. ఏసీబీ లిస్టులోకి వెళ్లడంతో అధికారుల చిట్టాను బయటికి తీస్తున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆఫీసర్ల ఆర్థిక పరిస్థితిని ఏసీబీ నిశితంగా విశ్లేషిస్తున్నది. అయితే.. ఆదాయానికికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నట్టు ఏసీబీ అనుమానిస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)