విజయసాయి రెడ్డి బ్రోకర్, ఆర్థిక ఉగ్రవాది !

Telugu Lo Computer
0



విజయసాయి రెడ్డి బ్రోకర్, ఆర్థిక ఉగ్రవాది అని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి విరుచుకుపడ్డారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోపిడీలో ముద్దాయి సాయిరెడ్డి.. అందుకే జైలుకి వెళ్లారని ఆరోపించారు. సాయిరెడ్డికి వ్యాపారాలు లేవంటే నెల్లూరు ప్రజలు నమ్మరు.. వారి చెవ్వుల్లో పువ్వులు లేవని వ్యాఖ్యానించారు. వేణుంబాక ఫౌండేషన్ 13 ఏళ్లలో రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు.. విజయసాయి రెడ్డి సేవ చేశానని చెప్పడం అబద్ధం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో సొంత నిధులు ఖర్చు చేసిన ఆధారాలు ఉన్నాయని ఆనం వెంకట రమణా రెడ్డి తెలిపారు. ఎంపీ ల్యాండ్స్ కింద సాయి రెడ్డి నెల్లూరు జిల్లాలో పదేళ్లలో రూపాయి అయినా ఖర్చు చేశారా అని ప్రశ్నించారు. నెల్లూరు బిడ్డ వేమిరెడ్డి మాత్రమే.. విజయసాయి రెడ్డి కాదన్నారాయన. వేమిరెడ్డి కులమతాలకు అతీతంగా విద్య, వైద్యం, తాగు నీరు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారని పేర్కొన్నారు. రూ.2.16 కోట్లతో స్విమ్స్ ఆసుపత్రికి క్యాన్సర్ వైద్యం కోసం వాహనం కొనిచ్చాడు.. శ్రీశైలం ఆలయానికి రూ. 11 కోట్లతో బంగారు రథం బహుకరించిన సేవా మూర్తి వీపీఆర్ అని కొనియాడారు. చర్చి, మసీదు, ఆలయాలకు ఆర్థిక సహయం చేస్తూ.. సేవా కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)