దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు భారీ లాభాలు నమోదు !

Telugu Lo Computer
0


దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు భారీ లాభాలు నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి పాజిటివ్‌ సంకేతాలు, దేశీయంగా ఆర్థిక వ్యవస్థలో సానుకూల వాతావరణం సూచీల పరుగుకు కారణమయ్యాయి. దీంతో సెన్సెక్స్‌, నిఫ్టీ రెండు సూచీలు సరికొత్త జీవనకాల గరిష్ఠాలను నమోదు చేశాయి. సెన్సెక్స్‌ 1200 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ 22,300 పాయింట్ల ఎగువన ముగిసింది. సెన్సెక్స్‌ ఉదయం 72,606.31 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆద్యంతం లాభాల్లోనే కొనసాగింది. ఓ దశలో 73,819.21 వద్ద జీవనకాల గరిష్ఠాలను తాకి కొత్త రికార్డును నమోదు చేసిన సూచీ.. చివరికి 1245 పాయింట్ల లాభంతో 73,745.35 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 355.95 పాయింట్లు లాభంతో 22,338.75 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.90గా ఉంది. సెన్సెక్స్‌లో టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎల్‌అండ్‌టీ, టైటాన్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు రాణించాయి. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ, ఇన్ఫోసిస్‌, సన్‌ఫార్మా, టెక్‌ మహీంద్రా షేర్లు మాత్రమే నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 83.03 వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 2055.60 వద్ద ట్రేడవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)