జీపీఎస్‌ జామింగ్‌ కు రష్యా కారణం కావచ్చని పలు దేశాల అనుమానం !

Telugu Lo Computer
0


విమానాలకు అత్యంత కీలకమైన జీపీఎస్‌ నావిగేషన్‌ సిగ్నల్స్‌కు సంబంధించి యూరప్‌లో ఆటంకాలు ఎదురవుతున్నాయి. తాజాగా తూర్పు యూరప్‌లో గడిచిన రెండు రోజుల్లోనే దాదాపు 1600లకు పైగా విమానాలు వీటి బారిన పడ్డాయి. వీటికి రష్యానే కారణం కావచ్చని పలు యూరప్‌ దేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. బాల్టిక్‌ ప్రాంతాన్ని నకిలీ జీపీఎస్‌ సిగ్నల్స్‌ సమస్య పీడిస్తున్నట్లు వీటిని ట్రాక్‌ చేసే ఓపెన్‌-సోర్స్‌ ఇంటెలిజెంట్‌ గ్రూప్‌ ఇటీవల వెల్లడించింది. ఈ క్రమంలో గడిచిన రెండు రోజుల వ్యవధిలోనే 1614 విమానాలు ప్రభావితమయ్యాయి. పోలాండ్‌, దక్షిణ స్వీడన్‌ ప్రాంతాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. ఫిన్లాండ్‌లోనూ ఇదే పరిస్థితి. బాల్టిక్‌ సముద్రంతో పాటు నాటో దేశాల సమీపంలోకి వచ్చే పౌర విమానాలు ఇటువంటి సమస్య ఎదుర్కొంటున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)