జావా సముద్రంలో భారీ భూకంపం ?

Telugu Lo Computer
0


ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. జావా సముద్ర ద్వీపంలో భారీ భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతగా నమోదయ్యింది. రాజధాని జకార్తాలో భూ ప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. భూకంప తీవ్రతకు భవనాలు కుప్ప కూలిపోయాయి, రోడ్లు దెబ్బతిన్నాయి. భూకంపం సుమారు ఎనిమిది కిలోమీటర్ల లోతున వచ్చింది. జావా ద్వీపం యొక్క ఉత్తర తీరంలో బవెన్ ద్వీపానికి సమీపంలో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:52 గంటలకు ఈ భూకంపం సంభవించింది. ఇండోనేషియాలో తరచూ భూకంపాలు జరుగుతుంటాయి. 2021 జనవరిలో సులవేసి ద్వీపాన్ని కుదిపేసింది. ఈ భూకంపంతో 100 మందికి పైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇక 2018లో సులవేసిలోని పాలూలో 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపంతో సునామీ కారణంగా 2,200 మందికి పైగా మరణించారు. అలాగే 2004లో కూడా భారీ భూకంపం సంభవించింది. అచే ప్రావిన్స్‌లో 9.1 తీవ్రతతో వచ్చిన భూకంపం, సునామీకి ఇండోనేషియాలో 170 వేల మందికి పైగా మరణించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)