ప్రధాని నరేంద్రమోడీకి "ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో" ప్రధానం !

Telugu Lo Computer
0


ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజుల పాటు భూటాన్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ''ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో'' అవార్డును భూటాన్ రాజు జిగ్మే ఖేసర్‌ నాంగ్యల్‌ వాంగ్‌చుక్‌ స్వయంగా ప్రధాని మోడీకి ప్రధానం చేశారు. భూటాన్ అత్యున్నత గౌరవాన్ని పొందిన తర్వాత ప్రధాని మోడీ మాట్లాడుతూ ఈ రోజు నా జీవితంలో చాలా పెద్ద రోజు, నాకు భూటాన్ అత్యున్న పౌర గౌరవం లభించింది. ప్రతీ అవార్డు ప్రత్యేకమైంది, కానీ మీరు అవార్డు వేరే దేశం నుంచి అందుకున్నప్పుడు , రెండు దేశాలు కూడా సరైన మార్గంలో వెళ్తున్నాయని చూపిస్తుంది. ప్రతీ భారతీయుడి తరుపున ఈ అవార్డును నేను తీసుకుంటున్నాను'' అని అన్నారు. భూటాన్ ప్రతిష్టాత్మక పౌర పురస్కారాన్ని అందుకున్న తొలి విదేశీ నేతగా ప్రధాని నరేంద్రమోడీ చరిత్ర సృష్టించారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న మోడీకి ఇది మూడో అత్యున్నత విదేశీ పురస్కారం. అంతకుముందు ఈ అవార్డును కేవలం నలుగురికి మాత్రమే భూటాన్ ఇచ్చింది. 2008లో రాయల్ క్వీన్ అమ్మమ్మ ఆషి కేసాంగ్ చోడెన్ వాంగ్‌చుక్‌కి, 2008లో హిస్ హోలీనెస్ జె త్రిజుర్ టెన్జిన్ డెండప్ (భూటాన్‌కు చెందిన 68వ జే ఖెన్పో)కి, 2018లో హిస్ హోలీనెస్ జె ఖెన్పో ట్రుల్కు న్గావాంగ్ జిగ్మే చోడ్రా ఈ అవార్డు అందించారు. భూటాన్ కేంద్ర సన్యాసి సంస్థకు ప్రధాన మఠాధిపతి జే ఖెన్పో. అంతకు ముందు ఈ రోజు భూటాన్ పారో విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని నరేంద్రమోడీకి ఆ దేశ ప్రధాని షేరింగ్ టోబ్గే ఘన స్వాగతం పలికారు. పారో నుంచి రాజధాని థింపు వరకు 45 కిలోమీటర్ల పొడవున ప్రజలు బారులుతీరి మోడీకి స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య పెట్రోలియం ఉత్పత్తులు, ఆహారం, ఇంధన సహకారం, క్రీడలు మరియు యువత, ఔషధ ఉత్పత్తులలో సహకారం, అంతరిక్ష సహకారం వంటి ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)