హిమాచల్‌ప్రదేశ్‌లో ముగ్గురు ఇండిపెండెంట్‌లు బీజేపీలో చేరిక ?

Telugu Lo Computer
0


హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల సందర్భంగా పార్టీ విప్‌ను ధిక్కరించి ఎన్డీఏ అభ్యర్థికి ఓటువేశారు. ప్రతిపక్ష బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్‌ సర్కారుపై తిరుగుబాటు చేశారు. దాంతో హిమాచల్‌ స్పీకర్‌ ఆ ఆరుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశారు. ఇటీవల షెడ్యూల్‌ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ఆ ఆరు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 68 స్థానాలకుగాను 40 స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మ్యాజిక్‌ ఫిగర్‌కు కేవలం 6 సీట్లు ఎక్కువగా కాంగ్రెస్‌కు వచ్చాయి. ఈ క్రమంలో బీజేపీ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి అనర్హత వేటుకు గురయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ కి 34 మందితో బొటాబొటీ మెజారిటీ మాత్రమే ఉన్నది. మరో ఎమ్మెల్యే చేజారినా హిమాచల్‌లో కాంగ్రెస్‌ సర్కారు కూలినట్టే. ఈ క్రమంలో ఆ రాష్ట్రంలో గెలిచిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో బీజేపీ రాజీనామాలు చేయించింది. త్వరలో వాళ్లు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాతో ప్రస్తుతం హిమాచల్‌ ప్రదేశ్‌లో ఎమ్మెల్యేల సంఖ్య 59కి తగ్గింది. ప్రభుత్వ ఏర్పాటుకు 30 మంది మద్దతు అసవరం. ప్రస్తుతం బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రేపు ఆరు అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో ఆరుగురు బీజేపీ అభ్యర్థులు గెలిస్తే సభలో వారి బలం 31కి చేరుతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు 33 మంది మద్దతు అవసరమవుతుంది. కాంగ్రెస్‌ నుంచి మరో నలుగురిని బీజేపీ తనవైపు తిప్పుకుంటే బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ స్పీకర్‌ గతంలోలాగే వారిపైన కూడా అనర్హత వేటు వేసినా కాంగ్రెస్‌ బలం 30కి పడిపోతుంది. అప్పుడు 31 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)