మోడీ తలచింది ఒకటైతే - జరుగుతోంది మరొకటి !

Telugu Lo Computer
0


ప్రధాని నరేంద్ర మోడీ తలచింది ఒకటైతే - జరుగుతోంది మరొకటని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు. ఆయన 'కాంగ్రెస్-ముక్త్ భారత్'ని కోరుకున్నారని, కానీ అందుకు బదులుగా 'అవినీతి-ముక్త్ కాంగ్రెస్' చేస్తున్నారని సెటైర్లు వేశారు. కాంగ్రెస్‌లో ఉన్న అవినీతిపరుల్ని తమ బీజేపీలోకి చేర్చుకుంటున్నారని పరోక్షంగా కౌంటర్ వేశారు. మాజీ ఎంపీ నవీన్‌ జిందాల్‌ కాంగ్రెస్‌ను వీడి, బీజేపీలో చేరిన తర్వాత జైరాం రమేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం బిజెపిలో చేరిన తర్వాత నవీన్ జిందాల్ మాట్లాడుతూ.. ''నా జీవితంలో ఇది ఎంతో ముఖ్యమైన రోజు. బీజేపీలో చేరినందుకు నేనెంతో గర్వపడుతున్నా. నేను ప్రధాని మోదీ నాయకత్వంలో దేశానికి సేవ చేయగలను. మోడీ కలలు కన్న వికసిత్ భారత్‌కు సహకరించాలని కోరుకుంటున్నా'' అని చెప్పారు. ఈ పరిణామంపై జైరాం రమేశ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ''మీకు ఓ పెద్ద వాషింగ్ మెషీన్ అవసరమైనప్పుడు.. ఇలాగే జరుగుతంది. గత పదేళ్లలో పార్టీకి శూన్య సహకారం అందించిన తర్వాత నేను ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పడం నిజంగా పెద్ద జోక్'' అని ఎద్దేవా చేశారు. ''ప్రధాని మోడీ కాంగ్రెస్-ముక్త్ భారత్‌ని కోరుకున్నారు. కానీ.. ఈడీ, సీబీఐ లాంటి వాషింగ్ మెషీన్‌ల సహకారంతో అవినీతికి పాల్పడిన కాంగ్రెస్ నేతలను తన కౌగిలికి చేరిపోయేలా చేసి, ప్రధాని మోడీ 'అవినీతి-ముక్త్ కాంగ్రెస్‌'ను చేశారు'' అని మరో ట్వీట్‌లో జైరాం రమేశ్ రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌లకు మనీలాండరింగ్ కేసుకు సంబంధించి జిందాల్‌ను నిందితుడిగా ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేయడంపై వచ్చిన రెండు వార్తా కథనాల స్క్రీన్‌షాట్‌లను కూడా ఆయన జత చేశారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)