తృణమూల్ మాజీ నేత షేక్ షాజహాన్‌ని ఈడీ అరెస్టు

Telugu Lo Computer
0


శ్చిమ బెంగాల్ సందేశ్‌ఖాలీ నిందితుడు షేక్ షాజహాన్‌ని మనీలాండరింగ్ కేసులో ఈడీ ఈ రోజు అరెస్ట్ చేసింది. సందేశ్‌ఖాలీలో భూకబ్జాలు, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసుల్లో ఇతను ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. బసిర్‌హత్ జైలులో ఉన్న అతడిని విచారించిన అధికారులు, ఆ తర్వాత అరెస్ట్ చేశారు. రేషన్ కుంభకోణం కేసులో విచారణకు వెళ్లిన ఈడీ అధికారులపై షేక్ షాజహాన్ అతడి అనుచరులు ఫిబ్రవరిలో దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామం తర్వాత సందేశ్‌ఖాలీలో మహిళలపై తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీకి చెందిన షాజహాన్, అతడి అనుచరులు అత్యాచారాలకు, అఘాయిత్యాలకు పాల్పడటంతో అక్కడి మహిళా లోకం ఒక్కసారిగా ఉద్యమించింది. పరారీలో ఉన్న షేక్ షాజహాన్‌ని అరెస్ట్ చేసి, శిక్షించాలని మమతా బెనర్జీ సర్కార్‌ని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలతో షేక్ షాజహాన్ పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా రాజకీయాల్లో సంచలనంగా మారింది.  ఈడీపై దాడి తర్వాత దాదాపుగా 55 రోజుల పరారీలో ఉన్న అతడిని అరెస్ట్ చేసే అధికారి సీబీఐ, ఈడీకి ఉందని కలకత్తా హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టు అతడిని సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఈ వివాదాల నేపథ్యంలో టీఎంసీ షాజహాన్‌ని పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేసింది. ఈడీ సోమవారం బసిర్‌హత్ కోర్టులో వారెంట్ సమర్పించి, షాజహాన్ రిమాండ్ కోరే అవకాశం ఉంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)