నారా లోకేష్‌కు జెడ్ కేటగిరీ భద్రత !

Telugu Lo Computer
0


టీడీపీ నేత నారా లోకేశ్ కు అపాయం ఉండటంతో భద్రతను పెంచుతూ కేంద్ర ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం లోకేష్‌కు జెడ్ కేటగిరీ ప్రకారం.. సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత కల్పించనున్నారు. 33 మంది కేంద్ర బలగాలకు చెందిన సిబ్బంది ఆయుధాలతో లోకేశ్ ఇంటికి చేరుకున్నారు. కాగా వైసీపీ ప్రేరేపిత దాడులు, నక్సలైట్ల హెచ్చరికలు, రాష్ట్ర ఇంటెలిజెన్స్ రిపోర్టులు ఆధారంగా కేంద్ర ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గతంలో చంద్రబాబు పై హత్యయత్నం జరగ్గా తీవ్రగాయాలతో బాబు బయటపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ కు సెక్యూరిటీ రివ్యూ కమిటీ జెడ్‌ కేటగిరీ కల్పించాలని చేసిన సిఫార్సులను పక్కనపెట్టి వై కేటగిరీ భద్రతను ఇచ్చింది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేసిందని.. లోకేశ్‌కు తగిన భద్రత కల్పించాలని కోరుతూ ఆయన భద్రతా సిబ్బంది చాలాసార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్‌, హోంశాఖలకు లేఖలు రాశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)