ఎయిరిండియాకు రూ.80 లక్షల జరిమానా ?

Telugu Lo Computer
0


పౌర విమానయాన నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఎయిరిండియా విమానయాన సంస్థకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ రూ.80 లక్షలు జరిమానా విధించినట్లు పేర్కొంది. జనవరిలో ఎయిర్‌లైన్స్‌లో నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించినట్టు గుర్తించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఎయిరిండియా సంస్థ 60 ఏళ్లు పైబడిన సిబ్బందితో కూడా కొన్ని సందర్భాల్లో విమానాలు నడిపినట్లు వెల్లడైందని.. ఇది సీఏఆర్‌ నిబంధనలకు విరుద్ధం అని డీజీసీఏ తెలిపింది. ఆపరేటర్లకు వారాంతపు విశ్రాంతి కోసం తగినంత సమయం ఇవ్వడం లేదని, అల్ట్రా-లాంగ్ రేంజ్ విమానాలు నడిపే ముందు, తర్వాత సిబ్బందికి విశ్రాంతిని అందించే నిబంధనల్ని ఎయిరిండియా ఉల్లంఘించిందని పేర్కొంది. వీటితో పాటు శిక్షణ రికార్డులను తప్పుగా నమోదు చేసిన సందర్భాలు గుర్తించామని డీజీసీఏ తెలిపింది. దీనిపై మార్చి1న సంస్థకు నోటీసు జారీ చేశామని, ఆ సంస్థ ఇచ్చిన సమాధానం తర్వాత రూ.80లక్షలు జరిమానా విధించినట్లు పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)