గన్నవరంలో తెదేపా మహిళా నేత మాధవిపై దాడికి యత్నం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గన్నవరంలో కడప తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి మాధవి విజయవాడకు కారులో వస్తూ గన్నవరంలో వైకాపా ఫ్లెక్సీలను గమనించారు. ఫొటోలు తీసి ఫ్లెక్సీల విషయం సీ-విజిల్‌ యాప్‌ ద్వారా ఈసీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన గన్నవరం వైకాపా అభ్యర్థి వంశీ వర్గీయులు ఆమెపై దాడికి యత్నించారు. మాధవి కారు కదలనీయకుండా వాహనాలు అడ్డుపెట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించి వేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)