జయప్రదను మార్చి 6వ తేదీ లోపు అరెస్టు చేయండి !

Telugu Lo Computer
0

సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు రామ్‌పుర్‌ ట్రయల్‌ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జయప్రదను మార్చి 6వ తేదీ లోపు అరెస్ట్ చేయాలంటూ రామ్‌పుర్‌ ట్రయల్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో నిబంధనలను ఉల్లఘించిన కేసులో ఉత్తర్‌ ప్రదేశ్‌లోని రామ్‌పుర్‌ కోర్టు విచారిస్తోంది. ఈ మేరకు జయప్రదకు కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. తనపై జారీ చేసిన నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ను నిలిపివేయాలంటూ జయప్రద అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించింది. అయితే.. హైకోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది. దాంతో.. జయప్రదకు మరోసారి ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది. 2019 నుంచే ఈ కేసులో విచారణ జరుగుతోంది. అప్పట్నుంచే కోర్టు విచారణకు రావాలని జయప్రదకు ఆదేశిస్తోంది. కానీ. ఆమె కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదు. కోర్టుకు గైర్హాజరు అవుతూనే వస్తోంది. దాంతో.. కోర్టు జయప్రద పరారీలో ఉన్నట్లు గతంలో ప్రకటించింది. ఆపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ను కూడా జారీ చేసింది. ఈ వారెంట్‌ను సవాల్‌ చేస్తూ అలహాబాద్‌ కోర్టును ఆశ్రయించింది నటి జయప్రద. అయితే.. తాజా హైకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. మరిన్ని వాస్తవాలతో తాము మరో పిటిషన్ దాఖలు చేస్తామనీ.. జయప్రద తరఫు న్యాయవాది కోరడంతో న్యాయమూర్తి అంగీకరించారు. కాగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో జయప్రద బీజేపీ అభ్యర్థిగా రాంపూర్‌ నుంచి బరిలో దిగారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. అయితే.. జయప్రద మాత్రం నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్డు ను ప్రారంభించింది. దాంతో.. జయప్రదపై స్వార్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. అప్పటి నుంచి ఈ కేసు రాంపూర్‌లోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టులో పెండింగ్‌లోనే ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)