శ్రీలంకకు తరలిస్తున్న రూ.108 కోట్ల డ్రగ్స్ సీజ్ !

Telugu Lo Computer
0


మిళనాడులో శ్రీలంకకు తరలిస్తున్న రూ.108 కోట్ల డ్రగ్స్ ను డీఆర్ఐ, ఇండియన్ కోస్ట్ గార్డ్ లు సీజ్ చేశారు. మండపం తీరంలో ఓ కంట్రీ బోటు నుంచి అక్రమంగా తరలిస్తున్న 99 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఓ అధికారి వెల్లడించారు. డ్రగ్స్ తో వెళ్తున్న పడవ శ్రీలంక వైపు వెళుతుండగా.. పక్కా సమాచారంతో అధికారులు బోటును వెంబడించి పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు సహా నలుగురిని డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేశారు. కాగా మండపం బీచ్ వద్ద అధికారులు మార్చి 4వ తేదీ రాత్రి కోస్ట్ గార్డ్ నౌక ద్వారా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వద్ద సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. 5వ తేదీన కూడా పర్యవేక్షిస్తున్న క్రమంలో అధికారులకు చిక్కారు. దీంతో.. వారిని విచారించేందుకు బోటు, నిషిద్ధ వస్తువులు, కోస్ట్ గార్డ్ స్టేషన్, మండపానికి తీసుకువచ్చారు. అనుమానితులను విచారించగా.. పడవలో ఉన్న బస్తాలలో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు గుర్తించారు. శ్రీలంకకు చెందిన గుర్తుతెలియని వ్యక్తులకు నిషిద్ధ వస్తువులను చేరుస్తున్నట్లు తెలిపారు. మరోవైపు.. డీఆర్‌ఐ అధికారులు స్మగ్లింగ్ ఆపరేషన్‌ సూత్రధారిని అతని నివాసంలో అరెస్టు చేశారు. భారత్ నుంచి శ్రీలంకకు తీర ప్రాంత మార్గంలో మత్తు పదార్థాలను రవాణా చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కాగా.. నలుగురు నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)