ఏడాది నుంచి అత్తను గదిలో బంధించిన కోడలు !

Telugu Lo Computer
0


ర్నాటక లోని తుమకూరు, శిరా గేట్ సమీపంలోని లేఔట్ లో 80 ఏళ్ల పంకజాక్షి అనే వృద్ధురాలు తన కుమారుడు, కోడలితో కలిసి నివాసం ఉంటుంది. చిన్నతనం నుంచి కొడును ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెళ్లి చేసింది. భర్త మరణంతో ఆమె కొడుకు వద్ద ఉంటూ జీవనం సాగిస్తోంది. అయితే కుటుంబ కలహాల కారణంగా కోడలు ఈ వృద్ధురాలిని వేధింపులకు గురి చేసింది. అంతేకాక పంకజాక్షిని ఏడాది నుంచి గదిలో నిర్భందించింది. ఆమెకు అన్నం, నీరు గదిలోకి పంపేది. వృద్ధురాలిని బయటకు రాకుండా అడ్డుకునేది. ఈ నేపథ్యంలో శుక్రవారం వృద్ధురాలి కుమారుడు మద్యం తాగి వచ్చి భార్యతో గొడవకు దిగాడు. తన తల్లిని బయటకు రాకుండా చేశావని మండిపడ్డాడు. ఇలా వీరి కుటుంబంలో జరిగిన గొడవతో ఆ వృద్ధురాలి విషయం బయటకు వచ్చింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పంకజాక్షి ఉండే ఇంటికి వెళ్లి తలుపులు తెరిచే ప్రయత్నం చేశారు. అయితే వారిని ఆ వృద్ధురాలి కోడలు అడ్డుకుంది. పోలీసులు గట్టి వార్నింగ్ ఇవ్వడంతో ఆ కోడలు వెనక్కి తగ్గింది. అనంతరం ఇంట్లోకి వెళ్లి గదిలో ఉన్న వృద్ధురాలిని బయటకు తీసుకువచ్చారు. పంకజాక్షితో జిల్లా న్యాయమూర్తి నూరున్నీసా ఘటన స్థలాన్ని పరిశీలించి వృద్ధురాలితో మాట్లాడారు. అనంతరం వృద్ధురాలిని ఆరోగ్య పరీక్షల నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్సలు అందించిన అనంతరం సాంత్వన కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా ఆ వృద్ధురాలు చెప్పిన మాటలు అందరి మనస్సు కలచి వేశాయి. తాను తన కోడలు ఉండే ఇంటికి వెళ్లనని, ఎక్కడైనా ఆశ్రయం కల్పించాలని వేడుకుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)