గుంటూరులో డయేరియా మరణాలపై స్పందించిన హైకోర్టు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు నగరంలో డయేరియా మరణాలపై ఏపీ హైకోర్టు స్పందించింది. వాస్తవాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో జడ్జి లీలావతి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి వారితో మాట్లాడారు. అనంతరం వారికి అందుతున్న చికిత్స, అనారోగ్యానికి గల కారణాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. దీనిపై నివేదికను కోర్టుకు సమర్పించనున్నారు. గత పదిరోజులుగా గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల ప్రజలు కలుషిత నీరు తాగి వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇందులో నలుగురు డయేరియా అనుమానిత లక్షణాలతో మృతి చెందారు. దీంతో నగరపాలక సంస్థ సరఫరా చేసే నీటిని తాగడానికి ప్రజలు భయపడుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)