శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బెదిరింపు మెయిల్స్‌ పంపిన యువకుడు అరెస్ట్‌

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని శంషాబాద్‌ విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్స్‌ పంపిన నిందితుడిని ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడిని బెంగళూరుకి చెందిన వైభవ్‌ తివారిగా గుర్తించారు. గతంలో రెండు సార్లు విమానాల్లో హైజాకర్లు వచ్చారని ఎయిర్‌పోర్ట్‌కి వైభవ్‌ మెయిల్స్‌ పంపాడు. అప్రమత్తమైన సిబ్బంది తనిఖీలు నిర్వహించి బెదిరింపు మెయిల్స్‌ నకిలీవిగా తేల్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు వైభవ్‌ను బెంగళూరులో అరెస్ట్‌ చేశారు. కొవిడ్‌ వల్ల ఐటీ ఉద్యోగం కోల్పోవడంతో మానసికంగా కుంగిపోయానని, ఆ డిప్రెషన్‌లోనే మెయిల్స్‌ పంపినట్లు వైభవ్‌ పోలీసులకు తెలిపాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)