బుల్లెట్‌ ట్రైన్‌ వీడియో వైరల్‌ !

Telugu Lo Computer
0


కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బుల్లెట్‌ ట్రైన్‌ గురించి ట్వీట్‌ చేశారు. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే బుల్లెట్‌ ట్రైన్‌ ఎలా ఉండబోతుందో వివరిస్తూ ఓ వీడియోని షేర్‌ చేశారు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. 508 కిలోమీటర్ల దూరం ముంబై - అహ్మదాబాద్ మధ్య 508 కి.మీల దూరాన్ని కవర్ చేసే ఈ బుల్లెట్ రైలు గరిష్టంగా గంటకు 320 కి.మీ వేగాన్ని అందుకోగలదని, ప్రయాణ సమయాన్ని కేవలం 2 గంటలకు తగ్గనుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.ఇక బుల్లెట్ ట్రైన్‌ ట్రాక్స్‌ కోసం 24 రివర్‌ బ్రిడ్జ్‌లు, 28 స్టీల్‌ బ్రిడ్జ్‌లు, 7 పర్వత ప్రాంతాల్లో టన్నెల్‌, 7 సముద్ర మార్గాన 7 టన్నెల్‌,12 స్టేషన్‌ల నిర్మాణం జరగనుంది. మోడీ 3.0లో బుల్లెట్ రైలు కోసం వేచి ఉండండి అంటూ అశ్విని వైష్ణవ్ షేర్‌ చేసిన వీడియోలో ముంబై-అహ్మదాబాద్ కారిడార్ నవంబర్ 2021 నుంచి బుల్లెట్‌ ట్రైన్‌ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మన దేశంలో మొదటి బుల్లెట్ రైలు గుజరాత్‌లోని బిలిమోరా - సూరత్ మధ్య 50 కి.మీల విస్తీర్ణంతో ఆగస్టు 2026లో పూర్తవుతుందని రైల్వే మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. రైల్వే శాఖ కార్యకలాపాలు ప్రారంభించే సమయంలో రోజుకు 70 ట్రిప్పులతో 35 బుల్లెట్ రైళ్లను నడపనుంది. 2050 నాటికి ఈ సంఖ్యను 105 రైళ్లకు పెంచాలని యోచిస్తోంది. కార్యకలాపాలు ప్రారంభమైనప్పుడు ప్రతి సంవత్సరం 1.6 కోట్ల మంది రైలులో ప్రయాణిస్తారని అంచనా. మొట్టమొదటి ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు ప్రాజెక్ట్ సుమారు రూ. 1 లక్ష 8,000 కోట్లు అంచనా వేయబడింది. ఆగస్టు 2026 నాటికి సూరత్-బిలిమోరా (63 కిమీ) మధ్య ట్రయల్ రన్‌ను లక్ష్యంగా పెట్టుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)