కవిత పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా !

Telugu Lo Computer
0


ఢిల్లీ లిక్కర్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈడీ తనకు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవాళ పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉంది. ఈ పిటిషన్‌పై త్వరగా విచారణ జరపాలని కవిత తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ ధర్మాసనాన్ని కోరారు. తగిన సమయం లేకపోవడంతో తదుపరి విచారణకు మరో తేదీ ఇవ్వాలని కపిల్‌ సిబాల్‌ సుప్రీంకోర్టును కోరారు. దీంతో.. కవిత కేసు విచారణను మార్చి 13కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఈడీ తనకు జారీ చేసిన సమన్లు రద్దు చేయాలని.. తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఈడీకి ఆదేశాలు ఇవ్వాలని కవిత సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిని జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ ధర్మాసనం ఇవాళ విచారణ జరపాల్సి ఉంది. అయితే తగినంత టైం లేకపోవడంతో.. వచ్చే నెల 13కు విచారణ వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)