టెక్సాస్‌లో కార్చిచ్చు బీభత్సం !

Telugu Lo Computer
0


మెరికాలోని  టెక్సాస్‌లో  కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. 780 కిలోమీటర్ల పరిధిలోని మొత్తం 2 లక్షల ఎకరాల్లో వృక్షాలు కార్చిచ్చుకు ఆహుతయ్యాయని ఎఅండ్‌ఎమ్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ తెలిపింది. అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు కారణంగా కార్చిచ్చు మరింత పెరిగిందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు టెక్సాస్‌, ద మిల్స్ క్రీక్‌, సాన్‌జాసిన్టోల్లో కార్చిచ్చు ఎగిసిపడుతోంది. అగ్నిమాపక సిబ్బంది, అధికారులు ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రావడం లేదు. కార్చిచ్చు పరిస్థితిని టెక్సాస్‌ రాష్ట్ర గవర్నర్‌ గ్రెగ్‌ అబాట్‌ సమీక్షించారు. ప్రజలు కార్చిచ్చు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు కార్చిచ్చు బీభత్సం కారణంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దాదాపు 780 కిలోమీటర్ల పరిధిలోని 2 లక్షల ఎకరాల్లో ఉన్న వృక్షాలను అగ్నికీలలు దహించి వేశాయి. స్మోక్‌హౌస్‌ క్రీక్‌ ఫైర్‌ లక్ష ఎకరాలను, గ్రేప్‌వైన్‌ క్రీక్‌ ఫైర్‌ 30 వేల ఎకరాలను, విండీ డ్యూసీ ఫైర్‌ 8 వేల ఎకరాలు ఆహుతి అయ్యాయి. ఇకపోతే తమను రక్షించాలంటూ సోషల్ మీడియా వేదికగా అధికారులను వేడుకుంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)