అంబానీ కొడుకు పెళ్ళిలో 2500 రకాల వంటకాలు ?

Telugu Lo Computer
0


రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ- నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి నిజానికి జులై 12వ తేదీన జరగనుంది. అయితే మార్చి 1,2,3 తేదీలల్లో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి. ఎన్‌కోర్ హెల్త్ కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్- శైలా మర్చంట్ చిన్న కుమార్తె రాధికా మర్చంట్‌ తమ జీవితాల్లోకి వస్తున్న ఆనందంలో ముందుగా చేస్తున్న పెళ్లి తంతు ఇది. దీని కోసం అంబానీ 2500 రకాల వంటకాలను సిద్ధం చేయిస్తున్నారట. ఇందుకోసం దేశం నలువైపుల నుండి ప్రత్యేకంగా 25 నుండి 30 మంది బెస్ట్ షెఫ్ లను నియమించినట్టు తెలుస్తోంది. వీరిలో ఒక్కొక్కరికి ఒక్కో టీమ్ ని అలాట్ చేయనున్నారట.  ఈ వేడుకలో బ్రేక్ ఫాస్ట్ కోసం 70 రకాల వంటకాలు సిద్ధం చేయిస్తున్నారట. ఇక లంచ్ కోసం 250 రకాలు, నైట్ డిన్నర్ కోసం మరో 250 రకాల వంటలు మెనులో ఉండబోతున్నాయట. మొత్తం 3 రోజుల పాటు సాగే ఈ వేడుకలో ఏ ఒక్క రోజు కూడా.. ఏ ఒక్క వంటకం రిపీట్ కాకుండా ఓవరాల్ మెనూ ఇప్పటికే సిద్ధమైంది అని సమాచారం. ఇక మిడ్-నైట్ స్నాక్స్ కౌంటర్ 3 రోజుల పాటు హైలెట్ గా నిలిచేలా అంబానీ ప్లాన్ చేయించారట. గెస్ట్ లు అంతా ఎక్కువగా నైట్ లైఫ్ కి అలవాటు పడ్డవారు కాబట్టి.. ఆ సమయంలో కూడా బెస్ట్ ఫుడ్ ఉండాలన్నది అంబానీ ఆలోచనగా తెలుస్తోంది. ఇక ప్రముఖ వంటకాలతో మెనూ గట్టిగానే సిద్ధమైనట్టు సమాచారం. ఇండియన్, ఏషియన్ కాంటినెంటల్, మెడిటేరియన్, స్పానిష్, జపనీస్, చైనీస్ అంటూ ఈ లిస్ట్ పెద్దగానే ఉంది. ఇక ఓవరాల్ గా ఒక్క రోజుకి ఒక మనిషి భోజనం ఖరీదు కనీసం రూ 15 వేలు వరకు అవుతుందని ప్రచారం జరుగుతోంది. మరి.. ప్రీ వెడ్డింగ్ సంబరాలకే ఇంత ఖర్చు చేస్తున్న అంబానీ.. ఇక పెళ్ళికి ఏ స్థాయిలో ఖర్చు పెడతారో అనే క్యాలిక్యులేషన్స్ ఇప్పటి నుండే మొదలైపోయాయి. మరి.. 2500 రకాల వంటకాలతో నిండిన మెనూపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Post a Comment

0Comments

Post a Comment (0)